Stock Market: యుద్ధ భయంతో.. కుప్పకూలిన సెన్సెక్స్..! 1 d ago
8K News-04/03/2026 భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ అమ్మకాల ఒత్తిడితో అతలాకుతలమై, తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,122.66 పాయింట్లు (1.40%) పతనమై 79,116.19 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) నష్టపోయి 24,480.50 స్థాయి వద్ద ముగిసింది. మార్కెట్లో సెంటిమెంట్ ఎంత బలహీనంగా ఉందంటే, దాదాపు అన్ని రంగాలు 2% నుండి 4% మేర భారీగా పడిపోయాయి.